
లక్నో: కేఎల్ రాహుల్ (176 నాటౌట్), సాయి సుదర్శన్ (100) సెంచరీలతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియా–ఎతో శుక్రవారం ముగిసిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా–ఎ ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది.
ఆసీస్ ఇచ్చిన 413 రన్స్ టార్గెట్‌ను ఇండియా ఛేజ్ చేసిన ఇండియా డొమెస్టిక్ ఫస్ట్-క్లాస్ చరిత్రలో ఆరో అతిపెద్ద సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌తో రికార్డుకెక్కింది. కెప్టెన్ ధ్రువ్ జురెల్ (56) కూడా రాణించాడు. సాయి సుదర్శన్ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటైనా, రిటైర్డ్ హర్ట్ నుంచి తిరిగి వచ్చిన రాహుల్ అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.