INDvSA టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్..!

INDvSA టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్..!

ఢిల్లీ: టీ20 ఐదు వన్డేల సీరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో రేపు జరిగే ఫస్ట్ టీ20 మ్యాచ్కి టీమిండియా రెడీ అయ్యింది. సొంతగడ్డపై గెలిచి సత్తాచాటాలనుకుంటున్న భారత్కు మొదటి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఐపీల్ లో అదరగొట్టిన భారత ప్లేయర్లు అదే జోరును కొనసాగించాలని చూస్తున్నారు. అయితే టీమిండియాలో ఫస్ట్ నుంచి అనుకున్న కొంతమంది ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపింది బీసీసీఐ. ఐపీఎల్ లో  ఫస్ట్ నుంచే రాణించిన కేఎల్ రాహుల్ను సౌతాఫ్రికా టీ20 సీజన్కు  పక్కన పెట్టారు. గాయంతో మొత్తం సిరీస్కు రాహుల్ దూరమైనట్టు బీసీసీఐ ప్రకటించింది. రాహుల్తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా సిరీస్ మొత్తానికి గాయంతో దూరమయ్యాడు. రాహుల్ సిరీస్కు దూరమవ్వడంతో వైస్ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు..హార్దిక్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఈ సిరీస్కు సీనియర్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్షన్ కమిటీ.. 18 మంది సభ్యులతో కూడిన టీమ్ ఎంపిక చేసింది. ఇప్పుడు రాహుల్ కూడా దూరమవ్వడం టీమిండియాకు లోటే అని చెప్పాలి.


విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల తర్వాత ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో ఆ స్థాయి బ్యాటర్​గా, మూడు ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం టీమిండియాకుప్రాతినిధ్యం వహించి, గొప్ప ప్లేయర్ల లిస్టులో చేరగల సామర్థ్యం ఉన్నవాడిగా పేరుంది కేఎల్‌ రాహుల్‌కు. అయితే ప్రతిభ విషయంలో ఏ లోటూ లేకపోయినా.. ఇంకా రాహుల్‌ పూర్తి స్థాయి మ్యాచ్‌ విన్నర్‌గా మారలేదన్నది విశ్లేషకుల మాట. ఐపీఎల్‌లో, అటు అంతర్జాతీయ క్రికెట్లో అతను కెప్టెన్‌గా లభించిన అవకాశాలను కూడా ఉపయోగించుకోలేకపోయాడు. అయితే సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో కుర్రాళ్లతో నిండిన భారత జట్టును నడిపించే బాధ్యతను సెలక్టర్లు అతడికే అప్పగించారు. బ్యాటర్​గా, కెప్టెన్‌గా బలమైన ముద్ర వేయడానికి రాహుల్‌కిది చక్కటి అవకాశమే. కానీ.. గాయంతో ఇప్పుడు రాహుల్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. మరి అందివచ్చిన అవకాశాన్ని రిషబ్ పంత్, హార్దిక్  సధ్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి.

భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌
మొదటి టీ20: జూన్‌ 9- గురువారం- అరుణ్‌ జైట్లీ స్టేడియం- ఢిల్లీ
రెండో టీ20: జూన్‌ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్‌
మూడో టీ20: జూన్‌ 14- మంగళవారం- డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం- విశాఖపట్నం
నాలుగో టీ20: జూన్‌ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం- రాజ్‌కోట్‌ 
ఐదో టీ20: జూన్‌ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు