వచ్చే ఏడాదిలో కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి

 వచ్చే ఏడాదిలో  కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్‌ హీరో సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి గత కొంతకాలంగా  ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరగనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఈ పెళ్లి మహారాష్ట్రలో కానున్నట్టు స్పష్టం చేశాయి. టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ టూర్ వెళ్లనున్నారని కూడా బీసీసీఐ ప్రకటించింది. 

దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. వీరి వివాహం కోసం ఏర్పాట్లు సాగుతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ అవన్నీ రూమర్సే అంటూ సునీల్ శెట్టి అప్పట్లో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇటీవలే ఇరువురి పెద్దలు అంగీకరించడంతో కేఎల్ రాహుల్ ఓ ఇంటి వాడవుతున్నాడంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.