
సెంచూరియన్: సౌతాఫ్రికాతో ఆదివారం మొదలయ్యే ఫస్ట్ టెస్ట్‌లో తాము ఐదుగురు బౌలర్లతో ఆడతామని ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ హింట్స్ ఇచ్చాడు. బ్యాటింగ్‌లో ఐదో నంబర్ స్లాట్ కోసం రహానె, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ ఉందన్నాడు. ‘టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ప్రతి టీమ్ 20 వికెట్లు తీయాలని కోరుకుంటుంది. అందుకే ఐదుగురు బౌలర్ల స్ట్రాటజీని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఓవర్‌సీస్‌లో మేం ఆడిన చాలా మ్యాచ్‌ల్లో మాకు ఇది ఉపయోగపడింది. ఫైవ్ బౌలర్స్‌ను తీసుకోవడం వల్ల వర్క్‌లోడ్ కూడా ఈజీ అవుతుంది. టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన కూడా ఇదే. ఇక, ఐదో నంబర్‌కు ఎవర్ని ఆడించాలన్నది చాలా టఫ్ డెసిషన్. మాకు ఇంకా రెండు రోజుల టైమ్ ఉంది. తొందర్లోనే ఫైనల్ ఎలెవన్‌పై ఓ క్లారిటీకి వస్తాం’ అని రాహుల్ చెప్పాడు.