Cricket World Cup 2023: బాగా ఆడినా విమర్శించారు.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్

Cricket World Cup 2023: బాగా ఆడినా విమర్శించారు.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్

బాగా ఆడినప్పుడు ప్రశంసలు, చెత్త ప్రదర్శనకు విమర్శలు రావడం సహజమే. ఇక క్రికెట్ ని విపరీతంగా అభిమానించే మన దేశంలో  ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం దీనికి మినహాయింపేమీ కాదు.ఇదిలా ఉండగా రాహుల్ మాత్రం తాను బాగా ఆడినా చాలా మంది విమర్శించారని విచారం వ్యక్తం చేసాడు. 

గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న రాహుల్ ఆసియా కప్ నుంచి తనలోని అత్యుత్తమ ఆటను బయట పెట్టాడు. అసలే ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రాహుల్ కి గాయాలు కూడా వేధించడంతో అతడు ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ ఆడేది అనుమానంగా మారింది. కానీ ఒక్కసారిగా రాహుల్ తనలోని ఇంకో వర్షన్ ని చూపించాడు. ఆసియా కప్ లో పాకిస్థాన్ మ్యాచుతో సెంచరీ కొట్టి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన రాహుల్.. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో తీవ్రమైన ఒత్తిడిలో 97 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

Also Read :- సాంట్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‪కి జడేజానే కారణం.. ఎలాగంటే..?

ఈ మ్యాచ్ అనంతరం ప్రెస్ తో మాట్లాడిన రాహుల్.. "నేను అంత చెత్తగా ఏమీ ఆడలేదు. కొన్ని మంచి ఇన్నింగ్స్ లు ఆడినా సోషల్   మీడియాలో నన్ను విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది". అని ఎమోషనల్ అయ్యాడు. ఫామ్ లేమితో టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రాహుల్.. ఐపీఎల్ లో చాలా నిదానంగా బ్యాటింగ్ చేస్తాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే విమర్శకులందరికి తన బ్యాట్ తోనే రాహుల్ సమాధానం చెప్పాడు.