కోలుకున్న రాహుల్.. త్వరలో ఇంగ్లండ్ కు పయనం!

కోలుకున్న రాహుల్.. త్వరలో ఇంగ్లండ్ కు పయనం!

టీమిండియాకు గుడ్ న్యూస్. ఓపెనర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. అపెండిసైటిస్ తో బాధపడుతూ ఐపీఎల్ కు దూరమైన రాహుల్.. ఇప్పుడు ఫిట్ నెస్ ను సాధించాడు. ఇంగ్లండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో పాల్గొనేందుకు త్వరలో అతడు పయనం కానున్నట్లు తెలిసింది. కాగా, తాను కోలుకున్న విషయాన్ని రూఢీ చేస్తూ వర్కవుట్లు చేస్తున్న ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో అతడి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.