డిజెబిలిటీ గ్రూప్‌కు వడ్డీ లేని రుణాలు పంపిణీ

డిజెబిలిటీ గ్రూప్‌కు వడ్డీ లేని రుణాలు పంపిణీ

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం సిటీలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు లో ఉన్న ఏపీజీవీబీ బ్రాంచ్ బ్యాంకు ద్వారా బాలాజీ డిజెబిలిటీ గ్రూప్ సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాలను గురువారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య  లబ్ధిదారులకు అందజేశారు. 

  స్వయం ఉపాధి, స్వాలంబన దిశగా ముందు కెళ్లేందుకు  రుణ సదుపాయాన్ని కల్పించినందుకు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలాజీ గ్రూప్ సభ్యులు, టీఎంసీ సుజాత, సీఓ  సల్మా  పాల్గొన్నారు.