వంటింటి ఆరోగ్య చిట్కాలు : మోకాళ్ల నొప్పులకు వెల్లుల్లి ఆయిల్ మసాజ్.. నడవటం కాదు.. పరిగెత్తుతారంట..!

వంటింటి ఆరోగ్య చిట్కాలు : మోకాళ్ల నొప్పులకు వెల్లుల్లి ఆయిల్ మసాజ్.. నడవటం కాదు.. పరిగెత్తుతారంట..!

శరీరంలో మంట పెరగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. కీళ్ల నొప్పులు.. నరాల నొప్పులు.. వాపు .. మోకాళ్ల  నొప్పులు  ఇలా ఒకటేమిటి అనేక సమస్యలు వస్తాయి.   అలాంటప్పుడు మనం తీసుకొనే ఆహారంలో కొన్ని మార్పులతో పాటు ఆయిల్​ మసాజ్​  అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.  వెల్లుల్లితో తయారు చేసిన ఆయిల్​ను మసాజ్​ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.  ఇప్పుడు దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం...

కీళ్ల నొప్పులకు నూనెతో మసాజ్ చేయడం మంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా నువ్వుల నూనె, వేడి నూనెలు, ఆముదం నూనె, వేప నూనె, కొబ్బరి నూనె వంటి నూనెలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కండరాలు రిలాక్స్ అవుతాయి మరియు నొప్పి తగ్గుతుంది.

వెల్లుల్లితో తయారు చేసిన  నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.  కండరాలు రిలాక్స్ అయి  నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టిరియల్​.. యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. 

 వెల్లుల్లి ఆయిల్​ ను  ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వెల్లుల్లి రెబ్బలను నూనెలో వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. వెల్లుల్లి బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత నూనెను చల్లార్చి, వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. 

వెల్లుల్లి ఆయిల్ తయారీకి కావలసినవి

  • వెల్లుల్లి రెబ్బలు :  4
  • నూనె (ఆలివ్, కొబ్బరి లేదా  నచ్చిన నూనె):  అర కప్పు

తయారీ విధానం: వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసి శుభ్రం చేయాలి. తరువాత నలిపి వాటినిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక బౌల్​ లో పెట్టుకోవాలి.  తరువాత ఒక గిన్నెలో నూనె పోసి.. స్టవ్​ వెలిగించిన తక్కువ మంటపై వేడి చేయాలి.  నూనె కాగిన తరువాత అందులో వెల్లుల్లి ముక్కలు వేసి.. గోధుమ రంగులోకి మారే వరకు వేడి చేయాలి. తరువాత గిన్నెను కిందకు దింపి.. పూర్తిగా చల్లారనివ్వాలి.  ఆ తరువాత ఆ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.  

ఉపయోగాలు

  • ఈ ఆయిల్​ .. నొప్పుల  సమస్యను తగిస్తుంది ..  రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
  •  ఈనూనెలో చిటికెడు ఇంగువ వేసి కలిపి  రోజూ ఉదయాన్నే తాగితే గ్యాస్​ సమస్యను.. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. 
  •  నిద్రను మెరుగుపరుస్తుంది. 
  •  తిమ్మిరిని తగ్గించి..  హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.