
Zoho Mail: దాదాపు వారం రోజులుగా వార్తల్లో ఎక్కడ చూసినా భారతదేశానికి చెందిన జోహో కంపెనీ పేరు మారుమోగిపోతోంది. ముందుగా వాట్సాప్ మెసేజింగ్ యాప్ కి పోటీగా కంపెనీ రిలీజ్ చేసిన అరట్టాయ్ పిచ్చపిచ్చగా వైరల్ కావటంతో చాలా మంది దానిని వాడినా వాడకపోయినా డౌన్ లోడ్ అయితే చేసేస్తున్నారు. అసలు దానిలో ఏం ఫీచర్స్ ఉన్నయో ముందుగా గమనిస్తున్నారు.
తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న జోహో సంస్థ యజమాని శ్రీధర్ వెంబు తీసుకొస్తున్న స్వదేశీ టెక్నాలజీ కనెక్టివిటీగా భారీగానే ప్రభుత్వం నుంచి కూడా స్పందన లభిస్తోంది. కంపెనీ తన డేటాను ఢిల్లీ, ముంబై, చెన్నైలోని సర్వర్లలో స్టోర్ చేయటంతో సేఫ్టీ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్న చాలా మంది దీనికి మారిపోతున్నారు. పైగా కంపెనీ తెచ్చిన జోహో వన్ అనే బిజినెస్ సూట్ కూడా వ్యాపార సంస్థల కోసం అందుబాటులోకి తీసుకురావటంతో దీనిపైపు మెుగ్గుచూపేవారి సంఖ్య పెరిగింది.
తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాను జీమెయిల్ నుంచి జోహో మెయిల్ కి మారుతున్నట్లు తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ సెన్సేషన్ అయ్యింది. దీంతో చాలా మంది తమ జీమెయిల్ జోహో మెయిల్ కి మైగ్రేట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జోహో మెయిల్ కి మారే ప్రక్రియ స్టెప్ బై స్టెప్..
1. జోహో మెయిల్ అకౌంట్ ఉచితంగా లేదా ప్రీమియం ప్లాన్ కింద తీసుకోవచ్చు.
2. Gmailలో IMAP యాక్టివ్ చేయండి: Gmail Settings → Forwarding and POP/IMAP → Enable IMAP.
3. జోహో మెయిల్‌లో Import/Migration Wizard వాడి.. ఇమెయిల్‌లు, కాంటాక్ట్స్, ఫోల్డర్లు జోహోకి ఇంపోర్ట్ చేయండి.
4. Gmailలో forwarding ఆప్షన్ యాక్టివ్ చేయటంతో.. కొత్త మెయిల్స్ జోహోకి పంపబడతాయి.
5. కొత్త జోహో అడ్రస్‌ను మీ కాంటాక్ట్స్ కి చెప్పండి. అన్ని ముఖ్యమైన అకౌంట్స్‌లో కొత్త వివరాలు అప్లోడ్ చేయండి.