అమెరికాలో రూ.వెయ్యి 200 కోట్లు జీతం తీసుకుంటున్న ఇండియన్.. అసలు ఎవరీ వైభవ్ తనేజా..!!

అమెరికాలో రూ.వెయ్యి 200 కోట్లు జీతం తీసుకుంటున్న ఇండియన్.. అసలు ఎవరీ వైభవ్ తనేజా..!!

Vaibhav Taneja Salary: ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలను ముందుకు నడిపించే రధసారథి పాత్రలో చాలా మంది భారతీయ వ్యక్తులు కొనసాగుతున్నాయి. వీరు తమ పనితీరుతో ఊహించని స్థాయిలో వేతనాలను అందుకున్నారు. వాస్తవానికి సుందర్ పిచాయ్, సత్యనాదేళ్ల వంటి అగ్ర సంస్థల సీఈవోలు ఇప్పటి వరకు భారీ వేతనాలు పొందుతున్న సంగతి మనకు తెలిసింది. అయితే వీరిని దాటేసి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిన వైభవ్ తనేజా గురించి చాలా మందికి అస్సలు తెలియదు. 

వాస్తవానకి వైభవ్ తనేజా భారత సంతతికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం అతను టెస్లాకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. 2024లో వైభవ్ మెుత్తం వార్షిక వేతన పేచెక్ విలువ 139 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ సుమారు రూ.1,195 కోట్లుగా ఉంది. తనేజా ఈ మెుత్తాన్ని కేవలం క్యాష్ రూపంలో కాకుండా కొంత స్టాక్ ఆప్షన్స్, మరికొంత ఈక్విటీ రివార్డ్ రూపంలో కూడా కలిగి ఉన్నారు. అయితే అమెరికా టెక్ దిగ్గజాలైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీసుకుంటున్న 10.73 మిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట సుందర్ పిచాయ్ పొందుతున్న 79 మిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువగా వైభవ్ శాలరీ అందుకోవటం గమనార్హం.

వాస్తవానికి తనేజా టెస్లా కంపెనీలో 2017లో వచ్చారు. దీనికి ముందు సోలార్ సిటీ కంపెనీలో పనిచేశారు. వాస్తవానికి ఈ సోలార్ ఎనర్జీ కంపెనీని టెస్లా 2016లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు 17 ఏళ్ల పాటు అతను ప్రైస్ వాటర్ కూప్ కంపెనీలో ఉద్యోగం చేశారు. మెుదట్లో టెస్లాలో అసిస్టెంట్ కార్పొరేట్ కంట్రోలర్ ఉద్యోగంలో చేరిన వైభవ్.. ఆ తర్వాతి కాలంలో సీఎఫ్ఓ స్థాయికి ఎదిగారు. ఇదే క్రమంలో అతను భారతదేశంలోని టెస్లాకు చెందిన టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా 2021 జనవరి నుంచి వ్యవహరిస్తున్నారు.

47 ఏళ్ల తనేజా తన విద్యను దిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో సీఏ కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ గా మారారు. అమెరికాలోని అనేక ఇతర కంపెనీలకు సైతం భారత సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు.