
ది ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2023 మే 1న న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హాలీవుడ్, బాలీవుడ్ ఫ్యాషన్ వరల్డ్ కి సంబంధించిన ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇండియా నుండి ప్రియాంక చోప్రా, ఆలియా భట్ తో పాటు పలు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. వరల్డ్ క్లాస్ టాప్ సెలబ్రెటీస్ అంతా తమ తమ అద్బుతమైన అవుట్ ఫిట్స్ తో చూపరులకు కనువిందు చేశారు. కోట్లు విలువ చేసే దుస్తువులు దరించి ర్యాంప్ వాక్ చేస్తూ కెమెరాలకు పోజులియిచ్చారు.
ఇక ఈ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా దరించిన ఒక నక్లెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఆ నక్లెస్ ఖరీదు అక్షరాల రూ.204 కోట్ల రూపాయలు. బల్గారీ బ్రాండ్ కి సంబందించిన ఈ నక్లెస్ లో అత్యంత విలువైన బ్లూ లగునా డైమండ్ ఉంటుంది. అందుకే ఆ నక్లెస్ కి అంత విలువ. ఇక ఈ నక్లెస్ దరించి ఆశ్చర్యానికి గురైన ప్రియాంక ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. బల్గారీ బ్రాండ్ అంబాసిడర్ కూడా ప్రియాంకనే. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ తో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిన ప్రియాంక.. బల్గారీ బ్రాండ్ నక్లెస్ దరించి మరోసారి వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది.