- 1,611 మందితో లిస్టు ప్రకటించిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
హైదరాబాద్, వెలుగు: 2026-27 విద్యా సంవత్సరం మెడికల్ పీజీ డిగ్రీ, డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి మేనేజ్‌మెంట్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను కాళోజీ హెల్త్ వర్సిటీ(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) ప్రకటించింది. మొత్తం 1,611 మందితో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. దీనితో పాటు విడుదల చేసిన నాట్ ఎలిజిబుల్ లిస్టులో తెలంగాణలో ఏడేళ్ల నివాస ధృవీకరణ పత్రం లేని కారణంగా రాణి. డి (ర్యాంక్ 1,27,965, స్కోర్ 270) అనే అభ్యర్థిని పేరును చేర్చారు.
ఈ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే ఆధార పత్రాలతో సహా నేటి సాయంత్రం 6 గంటలలోపు [email protected] కు మెయిల్ చేయాలని, గడువు తర్వాత వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకోమని, అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని వర్సిటీ తెలిపింది. మరోవైపు, కాంపిటెంట్ అథారిటీ కోటా మెరిట్ లిస్ట్‌కు అనుబంధంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం నాన్-సర్వీస్ కేటగిరీకి చెందిన ఆరుగురి అభ్యర్థుల అడ్మిషన్లను పరిగణనలోకి తీసుకున్నామని, హైకోర్టులో పెండింగ్ లో ఉన్న సంబంధిత రిట్ పిటిషన్ల తుది తీర్పునకు లోబడే వీరి అడ్మిషన్లు ఉంటాయని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
