కొచ్చి విమానాశ్రయంలో రూ.46 లక్షల విలువైన బంగారం స్వాధీనం

 కొచ్చి విమానాశ్రయంలో రూ.46 లక్షల విలువైన బంగారం స్వాధీనం

కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.46.50లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి జీ9 426 ఫ్లైట్ లో వచ్చిన ఓ ప్యాసెంజర్ నుంచి 1.18కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కొచ్చి కస్టమ్స్ ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ తెలిపింది. ఈ ప్రయాణికుడు త్రిసూర్ వాసిగా అధికారులు గుర్తించి, అరెస్టు చేశారు.

ఈ ప్రయాణికుడు బంగారాన్ని తరలించేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎన్నుకున్నాడు. 1.18 కేజీల బంగారాన్ని గుళికల రూపంలో చేసి, వాటిని శరీరంలో దాచుకున్నాడు. కానీ అధికారుల తనిఖీలల్లో నిందితుని నేరం బయటపడింది. దీంతో నాలుగు క్యాప్యూల్స్ రూపంలో ఉన్న బంగారాన్ని రికవరీ చేసుకున్నట్టు  అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందు కొచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుని నుండి రూ.48.50లక్షల విలువైన 1,192గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.