ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

 ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం :  ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
  • కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

మోతె (మునగాల), వెలుగు:  కోదాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నానని కోదాడ ఎమ్మెల్యే నలమాల పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం మోతె మండలం అన్నారిగుడెం నుంచి  కరక్కయలగూడెం వరకు రూ. 3.30 కోట్లతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పందిళ్ళపల్లి పుల్లారావు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.