సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లు పకోడీగాళ్లు.. మంత్రి కొడాలి నాని కౌంటర్

 సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లు పకోడీగాళ్లు.. మంత్రి  కొడాలి నాని కౌంటర్

చిరు హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య 200 రోజులు ఇటీవలే కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్.ఈ ఈవెంట్ లో చిరంజీవి( Chiranjeevi)  మాట్లాడుతూ సినిమా రంగంపై రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు. 

లేటెస్ట్ గా ఇదే విషయంపై మాజీ మంత్రి  కొడాలి నాని(Kodali Nani) స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లు పకోడీగాళ్లు.. ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. తనవాళ్లకు కూడా ఈ సలహాలు ఇస్తే బావుంటుందన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. కొడాలి నాని పరోక్షంగా స్పందించారు. ఈ కామెంట్స్ మళ్లీ ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. మనకెందుకురా బాబు మన డ్యాన్సులు, ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదన్నారు..కొడాలి నాని... 

వాల్తేరు వీరయ్య ఫంక్షన్ లో.. చిరంజీవి మాట్లాడుతూ సినిమా రంగంపై రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి అంటూ ఘాటుగానే స్పందించారు. 

అయితే సీఎం జగన్ను టార్గెట్ చేసే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా ప్రెస్ మీట్స్ పెట్టి..  చిరంజీవి ఖచ్చితంగా వైసీపీని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నారు. వీరి స్పందనకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకోవరు రియాక్ట్ అవుతారో చూడాలి మరి.