రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు: కోదండరెడ్డి

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు: కోదండరెడ్డి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని జాతీయ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. అందుకు ప్రభుత్వానికి కిసాన్​ సెల్​తరఫున కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను దోచుకున్నారని ఆరోపించారు.

 చత్తీస్ గఢ్​ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ జనరేషన్ లోనూ తప్పిదాలు జరిగాయని, ఈ ప్లాంట్లలో సెకండ్ హ్యాండ్ మిషన్లు వాడారన్నారు. విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై కమిషన్ చైర్మన్ ను నియమిస్తే.. ఆయనను నిందించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కమిషన్ అడిగిన ప్రతి దానికి  కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని, ధరణితో పెద్ద  భూస్కామ్​ జరిగిందని విమర్శించారు. గొర్రెల, చేప పిల్లల పంపిణీ లోనూ స్కామ్​లు జరిగాయన్నారు.