ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అలీఖాన్..

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అలీఖాన్..

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ లు ఇవాళ ( ఆగస్టు 16, 2024 ) ప్రమాణం చేశారు. శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు.  గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది రేవంత్ సర్కార్. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రమాణం తర్వాత కొత్త ఎమ్మెల్సీలతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు చైర్మన్, ఇతర సభ్యులు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ మండలిలో సభ్యుడిని కావడం సంతోషంగా ఉందని, అవకాశం ఇచ్చిన గవర్నర్, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల, అమరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని, ఎందరో బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు కోదండరాం.