
సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్. ఉత్తర తెలంగాణలో సింగరేణి ద్వారా చాలా మంది జీవితాలు బాగుపడ్డాయన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 2024, జూన్ 24వ తేదీ సోమవారం నాంపల్లిలోని పార్టీ ఆపీసులో ప్రో కోదండరామ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. పార్లమెంట్ చట్టం ద్వారా బొగ్గు గనులను జాతీయం చేశారని చెప్పారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెంచటమే కాదు లాభసాటిగా నడిచాయన్నారు.సింగరేణి ద్వారా చాలా ఆదాయం వస్తోందని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు వచ్చాయని అన్నారు.
గనుల్ని కచ్చితంగా వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. సింగరేణిని ఈచట్టం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు కోదండరామ్. గనుల్ని సింగరేణికి ఇవ్వకపోతే పదేళ్లలో సంస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. కేంద్రం వినకపోతే సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు కోదండరామ్.