- కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి
మద్దూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, దాంట్లో భాగంగానే కొడంగల్ నియోజక వర్గంలో అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజక వర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆయన కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ నరసింహులుతో కలిసి మండలంలోని చెన్నారెడ్డి పల్లి, అల్లీపూర్ ,పల్లెర్ల లో కాడా ఫండ్స్ తో ఒక్కో బిల్డింగ్ కు రూ.20 లక్షలతో .. కొత్తగా నిర్మించిన అంగన్ వాడీ స్కూల్ బిల్డింగ్ లను, మండలంలోని పర్సాపూర్ లో రూ.30 లక్షలతో స్కూల్ అదనపు క్లాస్ రూమ్స్, జాదవరావు పల్లి తండాలో రూ.30 లక్షలతో కొత్త జీపీ బిల్డింగ్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే దోరెపల్లిలో రూ. 1కోటి 30 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసినా పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆపలేరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి, మండల లీడర్లు హన్మిరెడ్డి,శివరాజ్,సర్పంచ్ కనకప్ప,ఉప సర్పంచ్ మహిపాల్ రెడ్డి, గ్రామస్తులు రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.
