
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసింది. ఈ టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక సిరీస్లో భాగంగా చివరి టెస్టు మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే నాల్గో టెస్టు ప్రారంభమవడానికి మరో ఐదు రోజులు ఉండటంతో దొరికిన కాస్త విరామాన్ని విరాట్ కోహ్లీ సతీమణితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
విరుష్క దంపతులు మధ్యప్రదేశ్లోని ఓ ఆలయాన్ని సందర్శించారు. ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ ఆలయం (Mahakaleshwar temple)లో కోహ్లీ, అనుష్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాతఃకాల పూజలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి కోహ్లీ, అనుష్క రావడంతో భక్తులు వారిని చూసేందుకు పోటీపడ్డారు.
విఫలం..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు కోహ్లీ అత్యధిక స్కోర్ 46 పరుగులే. మూడు టెస్టుల్లో కలిపి కోహ్లీ 111 పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 5 సార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.