లార్డ్స్‌‌లో కోహ్లీ, రూట్‌‌‌‌ తిట్టుకున్నరు..!

V6 Velugu Posted on Aug 26, 2021

లండన్‌‌: లార్డ్స్‌‌లో జరిగిన సెకండ్‌‌ టెస్ట్‌‌ మూడో రోజు ఇండియా, ఇంగ్లండ్‌‌ ప్లేయర్లు  వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఫీల్డ్‌‌లో మొదలైన ఈ వివాదం.. లార్డ్స్‌‌లోని లాంగ్‌‌ రూమ్‌‌లో తీవ్ర రూపం దాల్చినట్లు బ్రిటిష్‌‌ మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే.. మ్యాచ్‌‌ మూడో రోజు ఆటలో రూట్‌‌ భారీ సెంచరీ చేయగా, లాస్ట్‌‌ వికెట్‌‌గా అండర్సన్‌‌ క్రీజులోకి వచ్చాడు. అయితే అండర్సన్‌‌ను టార్గెట్‌‌ చేస్తూ బుమ్రా భయంకరమైన షార్ట్‌‌ పిచ్‌‌లతో దాడి చేశాడు. ఈ క్రమంలో గాయపడిన అండర్సన్‌‌.. బుమ్రాను తీవ్రంగా దూషించడంతో ఇరుజట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆట ముగిశాకా.. ఇరుజట్ల ప్లేయర్లు లార్డ్స్‌‌ లాంగ్‌‌ రూమ్‌‌లో గుంపులుగా విడిపోయి ఘోరంగా తిట్టుకున్నారంట. కోహ్లీ, రూట్‌‌ మాటలతో కవ్వించుకుంటూ.. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారని లోకల్‌‌ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన కోహ్లీ.. ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడలేనన్నాడు.

Tagged Face-off, Root,  Kohli, long room, Lords

Latest Videos

Subscribe Now

More News