సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు కోహ్లీ దూరం!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు కోహ్లీ దూరం!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు కోహ్లీ దూరం!
 విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్న సెలెక్టర్లు

ముంబై : ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత ఇండియాలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌తో పాటు ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు సిరీస్‌‌‌‌‌‌‌‌లకు ఎంపిక చేయకుండా కోహ్లీకి విశ్రాంతి ఇస్తామని ఓ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. దాంతో,  జులైలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లోనే విరాట్‌‌‌‌‌‌‌‌ మళ్లీ టీమిండియా జెర్సీ ధరించనున్నాడు. ఇక, నిరంతరాయంగా క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీకి తక్షణమే విరామం అవసరమని మాజీ హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ రవిశాస్త్రి మరోసారి  సూచించాడు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌ను పొడిగించుకోవాలనుకుంటే కోహ్లీ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకోవడం మంచిదని శాస్త్రి  అభిప్రాయపడ్డాడు.