
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్కరం సెంచరీతో చెలరేగాడు. 282 పరుగుల లక్ష్య ఛేదనలో చాలా ఓపికగా బ్యాటింగ్ చేస్తూ సఫారీ జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. 159 బంతుల్లో 11 ఫోర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్కరం పట్టుదల ముందు ఆస్ట్రేలియాకు ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. నాలుగో రోజు మరో 69 పరుగులు చేస్తే తొలిసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంటుంది. ఈ మ్యాచ్ లో మార్కరం సెంచరీ తర్వాత కోహ్లీ చేసిన పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది.
2018 లో మార్కరం క్లాసికల్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిన కోహ్లీ ఒక ట్వీట్ చేశాడు. " మార్కరం బ్యాటింగ్ చూడడానికి సంతోషంగా ఉంటుంది". అని ట్వీట్ ద్వారా తెలిపాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజంగా మార్కరం బ్యాటింగ్ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఈ సౌతాఫ్రికా బ్యాటర్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసికల్ బ్యాటర్. టెస్ట్ ఛాంపియన్ షిప్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన మార్కరం.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. క్లాసికల్ షాట్స్ తో అచ్చమైన టెస్ట్ క్రికెట్ చూపించాడు. కళ్ళు చెదిరే కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్ ఆడుతూ అలరించాడు.
ప్రారంభంలో రికెల్ టన్ (6) వికెట్ కోల్పోయినా.. ముల్డర్ తో కలిసి రెండో వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కెప్టెన్ బవూమతో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 143 రన్స్ జోడించి జట్టును గెలుపు ముంగిట నిలిపాడు. ఓపెన్ ఐడెన్ మార్‌క్రమ్ (159 బాల్స్‌లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ టెంబా బవూమ (121 బాల్స్‌లో 5 ఫోర్లతో 65 బ్యాటింగ్) ఫిఫ్టీతో సత్తా చాటడంతో ఆ జట్టు ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు మరో 69 రన్స్ దూరంలో నిలిచింది. ఆసీస్‌కు వికెట్లు 8 అవసరం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 207 రన్స్‌కు ఆలౌటైంది.
Virat Kohli's seven-year-old tweet about Aiden Markram has proven true, as South Africa is closing in on a WTC 2025 victory 👏#ViratKohli #AidenMarkram #WTCFinal #SAvAUS #CricketTwitter pic.twitter.com/J0YFiANzAR
— InsideSport (@InsideSportIND) June 14, 2025