ఐఎన్టీయూసీ మేనిఫెస్టో ఆవిష్కరణ

ఐఎన్టీయూసీ మేనిఫెస్టో ఆవిష్కరణ

కోల్​బెల్ట్​,వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘం కోసం ఐఎన్టీయూసీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ఆవిష్కరించారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ ​బి.జనక్​ప్రసాద్​ఆధ్వర్యంలో మేనిఫెస్టోను ప్రేమ్​సాగర్​ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కాంగ్రెస్​పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. యూనియన్​గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్​ఏరియా వైస్​ప్రెసిడెంట్ జెట్టి శంకర్​రావు, కేంద్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్, గరిగె స్వామి, చందుమోహన్, ఆకుల రాజన్న, మల్లారెడ్డి, రంగిశెట్టి శ్రీనివాస్, నంబయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేను కలిసిన సింగరేణి ఆఫీసర్లు

శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆఫీసర్లు ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందారం, శ్రీరాంపూర్​ఓసీపీల పీవోలు ఎం.శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి తదితరులున్నారు.