వినూత్న కాన్సెప్ట్ తో కోకో.. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ మాయాజాలం

వినూత్న కాన్సెప్ట్ తో కోకో.. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ మాయాజాలం

టాలీవుడ్ లో మరో కొత్త కాన్సెప్ట్ తో రానున్న సినిమా "కోకో". సైంటిఫిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాని దర్శకుడు జై కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కనిపెట్టిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ హ్యాకర్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ అని సమాచారం.  మిరాయి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వాసా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన క్షణాల్లోనే రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక టీజర్ లో ఒక్కో సీన్, ఒక్కో విజువల్ నెక్స్ట్ లెవల్లో ఉంది. విఎఫ్ఎక్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అందుకే ఈ టీజర్ ను చూసిన ఆడియన్స్ కు సరికొత్త ఫీలింగ్ కలగడం ఖాయం. ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

ఇక ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ జూన్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. వియత్నాం, లడఖ్, చైనా, కేరళ హైదరాబాద్ వంటి లొకేషన్స్ లో 100 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. సినిమాకి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా 2024 లో ప్రేక్షకుల మునుకు రానుంది.