లెదర్ ఫ్యాక్టరీని ఉపయోగంలోకి తేండి :

లెదర్ ఫ్యాక్టరీని ఉపయోగంలోకి తేండి :

ఆర్మూర్, వెలుగు: 2003లో కాంగ్రెస్ హయాంలో ఆర్మూర్​లో శంకుస్థాపన చేసిన మినీ లేదర్ పార్క్ ఉపయోగంలోకి తీసుకురావాలని పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేశ్​శనివారం ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలను కోరారు. శనివారం కాంగ్రెస్ లీడర్లు టౌన్ శివారులోని లెదర్ పార్క్ ను పరిశీలించారు. అనంతరం కోలా వెంకటేశ్​ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరయ్యాయని చెబుతున్నా, ఇంత వరకు ఫ్యాక్టరీని ప్రారంభించడంలో పురోగతి కనిపించడం లేదన్నారు.

లెదర్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా బతుకులు బాగుపడతాయని ఆశించి, అనేక మంది దళితులు చెన్నై వెళ్లి శిక్షణ పొందారని, ప్రస్తుతం వారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. లెదర్ ఫ్యాక్టరీని వినియోగంలోకి తీసుకొస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి, ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. లీడర్లు మీర్ మాజీద్, జిమ్మి రవి, అజ్జు, ఫయీమ్, మీసాల రవి, అబ్దుల్ బారి, మెహబూబ్, హబీబ్, ఉస్మాన్, పెద్ద పోశెట్టి, పాషా, ప్రసాద్, అభిమన్యు, మల్లికార్జున్​ పాల్గొన్నారు.