ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను రూ.9.20 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఈ మేరకు శనివారం (జనవరి 3) కేకేఆర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు పేట్రేగిపోవడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బంగ్లా పేసర్ ను రిలీజ్ చేయాలని కేకేఆర్ యాజమాన్యాన్ని బీసీసీఐ ఆదేశించింది. ఈ కారణంగా ఈ బంగ్లా పేసర్ ను కేకేఆర్ రిలీజ్ చేసింది.
ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయడంతో ఇప్పుడు అతని కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం 9.20 కోట్ల పూర్తి వాపసును పొందే అవకాశం ఉందని లీగ్ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం దౌత్యపరమైన లేదా భద్రతాపరమైన కారణాల వల్ల ఒక ఆటగాడిని జట్టు నుండి ఉపసంహరించుకున్నప్పుడు ఫ్రాంచైజీ సాధారణంగా ఆ ఆటగాడి మొత్తం వేలం ధరను తిరిగి వారి పర్స్‌లో జమ చేసుకునే హక్కును కలిగి ఉంటుంది.రూ.9.2 కోట్ల రీ ఫండ్ కేకేఆర్ జట్టుకు లభించడంతో ఆ ధరకు నాణ్యమైన ఆటగాడిని ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో నియమించుకోవచ్చు. కేకేఆర్ ఖాతాలో రూ.9.20 కోట్లు జమ అవుతాయి.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ను వదిలేసుకున్న క్రమంలో రీప్లేస్‌మెంట్‌కు కేకేఆర్‌కు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. 2026 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఆక్షన్‌లో నిలిచిన ముస్తఫిజుర్ను 9.20 కోట్లకు కేకేఆర్ జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉండటంతో ముస్తాఫిజుర్ కోసం చెన్నై, ఢిల్లీ జట్లుతో పోటీ పడి మరీ కేకేఆర్ దక్కించుకుంది. తద్వారా ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన బంగ్లా ప్లేయర్ గా ముస్తాఫిజుర్ నిలిచాడు. కానీ ఇరుదేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల వల్ల అతడికి 2026 సీజన్ ఐపీఎల్ ఆడే అవకాశం లేకుండా పోయింది.
