DC vs KKR: వైజాగ్‌లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోల్‌కతా

DC vs KKR: వైజాగ్‌లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోల్‌కతా

ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. వైజాగ్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ తమ ప్లేయింగ్ 11 లో ఒక మార్పు చేసింది. ముకేశ్ కుమార్ గాయపడడం వలన అతని స్థానంలో సుమీత్ వచ్చాడు. మరోవైపు కేకేఆర్ జట్టులోకి రఘువంశీ వచ్చి చేరాడు. ఢిల్లీ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లాడితే ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలుపొందింది. 


ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): 

ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్) , రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి