
ఈ సీజన్ ఐపీఎల్ ను ఓటములతో ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మరో సవాల్‌కు రెడీ అయ్యాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో పోటీ పడనున్న ఈ రెండు జట్లు టోర్నీలో బోణీ కొట్టాలని ఆశిస్తున్నాయి. అంతగా అనుభవం లేని మిడిలార్డర్ తో బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని హైదరాబాద్.. ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయి నిరాశ పరిచింది . చివరి ఐదు ఓవర్లలో 43 రన్స్ అవసరమైన దశలో 32 పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోయి ఓడింది . మిచెల్ మార్ష్ గాయం కూడా ఆ జట్టును దెబ్బకొట్టింది . ఇప్పుడు అతని సేవలను పూర్తిగా కోల్పోయిన హైదరాబాద్ విజయాల బాట పట్టాలంటే కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లో ముందుండి నడిపించాల్సి ఉంటుంది .ఫస్ట్ మ్యాచ్‌లో దురదృష్ట వశాత్తూ రనౌటైన అతను ఈ సారి బ్యాట్ ఝుళిపించాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో పాటు మనీశ్ పాండే ఫామ్‌లో ఉండడం ప్లస్ పాయింట్. కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగితే బ్యాటింగ్ మరింత బలంగా మారనుంది . అతను వన్‌డౌన్‌లో వస్తే మనీశ్ నాలుగో నంబర్‌లో దిగొచ్చు.అప్పుడు మిడిల్ కూడా స్ట్రాంగ్ కానుంది . ఇక, సన్‌రైజర్స్ బౌలింగ్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది .ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌తో పాటు అఫ్గాన్ మరో స్పిన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ బరిలోకి దిగొచ్చు. మరోవైపు ఈసారి పలువురు స్టార్ ఆటగాళ్లను తీసుకొని స్ట్రాంగ్ టీమ్‌గా కనిపించిన కేకేఆర్ తొలి పోరులో అంతగా ఆకట్టుకోలేకపోయింది . ముంబైతో పోరులో కెప్టెన్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ నిర్ణయాలు బెడిసి కొట్టాయి. లాస్ట్ సీజన్‌లో భీకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఆండ్రీ రసెల్‌ను ఆరో నంబర్‌లో పంపించి విమర్శల పాలయ్యాడు. ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కెప్టెన్ మోర్గాన్ కూడా ఐదో నంబర్‌లో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో, ఈ పోరులో కార్తీక్ కెప్టెన్సీకి మరోసారి పరీక్ష ఎదురుకానుంది . ఓవరాల్ గా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగైతేనే కోల్‌కతా విజయాల బాట పట్టగలదు.