సోష‌ల్ మీడియాలో తుపాకీల అమ్మ‌కం.. 24 ఏళ్ల యువ‌కుడి అరెస్ట్

సోష‌ల్ మీడియాలో తుపాకీల అమ్మ‌కం.. 24 ఏళ్ల యువ‌కుడి అరెస్ట్

కోల్‌క‌తా: మ‌న దేశంలో ఎవ‌రికైనా ప్రాణ హాని ఉంటే గ‌న్ లైసెన్స్ తీసుకుని పోలీసుల నుంచి ప‌ర్మిష‌న్ తీసుకుని మాత్ర‌మే తుపాకీ ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. బ‌య‌ట ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తుపాకులు కొనుక్కోవ‌డం కుద‌ర‌దు. అలా ఎవ‌రైనా అమ్మినా, కొన్నా అది చ‌ట్ట విరుద్ధం. కానీ ప‌శ్చిమ బెంగాల్‌లో ఓ యువ‌కుడు ఏకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి మ‌రీ అక్ర‌మంగా తుపాకులు అమ్మ‌డం షురూ చేశాడు. దీని గురించి స‌మాచారం రావ‌డంతో కోల్‌క‌తా పోలీసులు రైడ్ చేసి 24 ఏండ్ల యువ‌కుడిని అరెస్ట్ చేశారు.
కోల్‌క‌తా సిటీ ప‌రిధిలోని నార్త్ 24 ప‌ర‌గ‌ణాస్ ఏరియాకు చెందిన కిష‌న్ జైస్వ‌ర (24) అనే యువ‌కుడు నాటు తుపాకీల‌ను ఇంప్ర‌వైజ్ చేసి అక్ర‌మంగా అమ్మ‌కాలు జ‌రుపుతున్నాడు. దీని కోసం ఫేస్‌బుక్, వాట్సాప్‌ల‌ను వాడుకున్నాడు. కొన్ని గ్రూప్‌ల‌ను క్రియేట్ చేసి తుపాకుల‌కు సంబంధించి పోస్టులు పెట్టి సేల్స్ చేస్తున్నాడు. ఇది పోలీసుల దృష్టికి రావ‌డంతో రైడ్ చేసి కిష‌న్‌ను అరెస్ట్ చేశారు. ఆ స‌మ‌యంలో అత‌డి నుంచి ఒక నాటు తుపాకీ, ఒక క్యాట్రిడ్జ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకుల అమ్మ‌కంలో అత‌డికి స‌హ‌క‌రించిన వాళ్లంద‌రిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. గ‌తంలోనూ కిష‌న్‌పై ఇత‌ర అక్ర‌మ ఆయుధాల కేసులు ఉన్నాయ‌ని చెప్పారు.