
కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్జికార్ ఆసుపత్రి కేసుకు సంబంధించిన పిటిషన్ పై విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల భద్రత కోసం పది మంది ప్రముఖ వైద్యులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.ఈ ఘటనలో బాధితురాలి పేరు, ఫోటో మరియు వీడియో క్లిప్‌లు ప్రతిచోటా పబ్లిష్ చేయటంపై తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది.
బాధితుల పేర్లను ప్రచురించటం చట్టపరంగా నిషేధం అయినప్పటికీ ఆమె పేరును పబ్లిష్ చేస్తే ఆమెను కించపరిచినట్లు కాదా అని ప్రశ్నించింది.నిరసనకారులపై అధికారం చెలాయించొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది సుప్రీంకోర్టు.పరిస్థితుల్లో మార్పు కొసం ఇలాంటి మరో హత్యాచార ఘటన జరిగేంతవరకు దేశం వేచి ఉండదని అబిప్రాయాపడింది సుప్రీం.