డబ్బులు పోసుకున్నారు : కోల్ కతాలో 6 రోజుల్లో.. 11 వందల కోట్ల రెస్టారెంట్ వ్యాపారం..

డబ్బులు పోసుకున్నారు : కోల్ కతాలో 6 రోజుల్లో.. 11 వందల కోట్ల రెస్టారెంట్ వ్యాపారం..

ఎప్పటిలాగే కోల్ కతాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ సారి ఈ వేడుకల సందర్భంగా అక్కడి రెస్టారెంట్లు కూడా ఈ సమయంలో లాభాలను అంది పుచ్చుకోవడం గమనార్హం. నగరంలోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు కేవలం ఆరు రోజుల్లోనే రూ. 11వందల కోట్లను ఆర్జించాయి. ఇది 2022లో ఆర్జించిన ఆదాయం కంటే 20% కంటే ఎక్కువ అని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది.

తెల్లవారుజామున 3 గంటల వరకు పలు రకాల తినుబండారాలు అందుబాటులో ఉంచడం వల్ల దశమి వరకు.. చివరి ఆరు రోజులు కోల్ కతాలోని ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ కమ్ బార్ యజమాని అయిన HRAEI ప్రెసిడెంట్ సుదేష్ పొద్దార్ తెలిపారు. "ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ కాలంలో నగరంలోని రెస్టారెంట్లు రూ. 1,100 కోట్ల వ్యాపారం చేశాయి" అని పొద్దార్ చెప్పారు. 2022తో పోలిస్తే ఈ అమ్మకాలు 20-25శాతం పెరిగాయన్నారు. కొన్ని రెస్టారెంట్లలో విక్రయాలు 2019కొవిడ్ కు ముందు రోజుల కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.