ఇంత క్రూరత్వం ఏంటీ : ఆస్పత్రిలోనే.. డాక్టర్‌ను అత్యాచారం చేసి.. చంపేశారు

ఇంత క్రూరత్వం ఏంటీ : ఆస్పత్రిలోనే.. డాక్టర్‌ను అత్యాచారం చేసి.. చంపేశారు

కల్‌కత్తాలో శనివారం ఓ దారణం వెలుగులోకి వచ్చింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ సెమినార్ హాల్ లో ఆగస్ట్ 9న నగ్నంగా లేడీ ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. పోస్టమార్టం చేసిన అనంతరం ఆమెని అత్యాచారం చేసి హత్య చేశారని తేలింది. 

ఆమె అదే హాస్పిటల్ లో ట్రైనీగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ డాక్టర్ గా గుర్తించారు. ఆమె శరీర అవయవాలపై గాయాలు, ప్రైవేట్ పార్ట్స్ లో రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. కోల్‌కతాలోని  ప్రాథమిక పోస్ట్‌మార్టంలో హత్యకు ముందు ఆమె లైంగిక వేధింపులకు గురైందని తేలింది. 

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు, జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నేరానికి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు కూడా మద్దత్తు ప్రకటించారు. పోలీసులు ఈ ఘనటపై కేసు నమోదు చేసి.. సీసీకెమెరా పుటేజ్ఆధారంగా అనుమానస్పదంగా అనిపించిన ఓ వ్యక్తి అరెస్ట్ చేశారు. 

RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని, నిజం దాచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బాధితురాలి తండ్రి ఆవేధన వ్యక్తం చేశాడు. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు, బిజెపి నాయకులు నిరసనలు చేస్తున్నారు.