ఇకపై రాజకీయాలపై పూర్తి ఫోకస్

ఇకపై రాజకీయాలపై పూర్తి ఫోకస్

ఇకపై తాను సినిమాలు చేయబోనని, పూర్తి సమయాన్ని రాజకీయాల కోసం వెచ్చించనున్నట్లు కోలీవుడ్ హీరో, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశాడు. తన తాజా చిత్రం ‘నెంజుకు నీధి’ ప్రమోషన్స్ లో ఉదయనిధి స్టాలిన్ ఈ ప్రకటన చేశాడు. ‘మామన్నన్’ తన చివరి సినిమా అని ప్రకటించి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడే ఉదయనిధి స్టాలిన్. ఇక వాళ్ల తాత మాజీ సీఎం కరుణానిధి అనే విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో తన తండ్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకోగా... ఎంకే స్టాలిన్ సీఎం అయ్యారు. ఇక ఉదయనిధి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాడు. అయితే సినిమాల్లో నటించడం వల్ల తన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని ఉదయనిధి చెప్పాడు. అందుకే ఇకపై తన తండ్రితో కలిసి పూర్తిగా ప్రజా సేవలోనే కొనసాగనున్నట్లు ప్రకటించాడు.  

మరిన్ని వార్తల కోసం...

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్ 

‘మా’ సభ్యులకు హెల్త్ క్యాంప్ ..

రెండోసారి కరోనా బారిన పడ్డ అక్షయ్‌ కుమా..