‘మా’ సభ్యులకు హెల్త్ క్యాంప్ 

 ‘మా’ సభ్యులకు హెల్త్ క్యాంప్ 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) ఆధ్వర్యంలో సిబ్బంది మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ‘మా’ సభ్యులకు ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు ఫ్రీగా హెల్త్ చెకప్స్ చేశారని, సెవెన్ స్టార్ సౌకర్యాలతో సేవలందించారని ఆ సంస్థ అధ్యక్షుడు విష్ణు చెప్పారు. మంచు విష్ణు ‘మా’అధ్యకుడైన తరువాత మొదటిసారి సంస్థ సభ్యుల హెల్త్ కి ప్రాముఖ్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నరేష్ చెప్పారు. 

సభ్యుల అవకాశాలకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశామని, అందరూ ఆరోగ్యంగా ఉంటే సినిమా అవకాశాలు వస్తాయన్నారు. AIG హాస్పిటల్ వారు ‘మా’కు అందిస్తున్న సహకారం మరువలేనిదని, AIG హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మంచు విష్ణు అధ్వర్యంలో రెండోసారి హెల్త్ క్యాంప్ నిర్వహించామంటున్నారు.  

మరిన్ని వార్తల కోసం..

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్ 

అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం

ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం