విజయ్ బీస్ట్ సినిమా రివ్యూ

విజయ్ బీస్ట్ సినిమా రివ్యూ

నటీనటులు: విజయ్-పూజా హెగ్డే-షైన్ టామ్ చాకో-సెల్వ రాఘవన్-పృథ్వీ-యోగిబాబు-రెడిన్ కింగ్స్లీ-అపర్ణా దాస్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
మాటలు: హనుమాన్ చౌదరి
నిర్మాత: కళానిధి మారన్ (తెలుగు రిలీజ్: దిల్ రాజు)
రచన-దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
 

కథ:
వీర రాఘవ (విజయ్) ఒక ‘రా’ ఏజెంట్. ఓ మిషన్ లో బాగంగా..టెర్రరిస్టును పట్టుకునే క్రమంలో..అనుకోకుండా..ఓ పాప చనిపోతుంది. దాంతో..తన కారణంగా..ఓ చిన్నరి ప్రాణం వదిలేసింది అని..రా నుండి బయటకు వచ్చేస్తాడు. వీర రాఘవకు ప్రీతి (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. ఇతన్ని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. స్టోరీ ఇలా జరగుతుండగా..చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్ ను ఉగ్రవాదులు ముట్టడి చేసి ఉమర్ ఫరూక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ సమయంలో..వీర అదే మాల్ లో ఉంటాడు. అక్కడ..బందీలుగా మారిన..జనాల కోసం పోరాటం మొదలు పెడతాడు.మరి..వీర రాఘవ విజయం సాధించాడా ? లేదా ? అన్నది స్టోరీ
నటీనటుల పర్ఫార్మెన్స్:
విజయ్ లుక్స్ తో..తనదైన స్టైల్స్ తో ఆకట్టుకున్నాడు. తన గత చిత్రాల కంటే భిన్నంగా ఉగ్రవాద నేపథ్యం ఉన్న సినిమాలో నటించి..కొత్తగా కనిపించాడు. పూజా హెగ్డే..గ్లామర్ పాత్ర వరకు పనికొచ్చింది. ఈమె పాత్రకు అంతగా ప్రధాన్యత లేదు. మూవీలో విజయ్ వన్ మ్యాన్ షో యాక్షన్ కాబట్టి..మెయిన్ విలన్ కూడా చేసింది ఏం లేదు. దర్శకుడు సెల్వ రాఘవన్ తన పాత్రకు న్యాయం చేసాడు. వీటీవీ గణేష్, యోగిబాబు నవ్వించే ప్రయత్నం చేసారు.
 

టెక్నికల్ వర్క్:
ఈ మూవీలో అనిరుద్ అందించిన సంగీతానికి, బ్యాక్ గ్రౌండ్ స్టోరుకు మంచి మార్కుల పడతాయి. మనోజ్ పరమహంస  సినిమాటోగ్ర‌ఫీ కూడా ఆకట్టుకుంది..అలాగే.. ఆర్ట్ వర్క్,ప్రొడక్షన్ వాల్యూయ్స్ కూడా బాగున్నాయి.
 

విశ్లేషణ:
సీరియస్ సిచ్చువేషన్ లో కూడా..కామెడీతో నవ్వించే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సారి ఉగ్రవాదుల మధ్య చిక్కుకున్న జనాల..టెన్సన్ మధ్య ..తనదైన కామెడీ పండించే ప్రయత్నం చేసిన..ఫలించలేకపోయింది.పైగా స్టార్ హీరో విజయ్ కోసం సినిమాటిక్ లిబర్టీస్ కూడా తీసేసుకున్నాడు. ఫస్టాప్ ఒకే అనిపించిన..సెకండాఫ్ లో డల్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. తలపతి హీరోయిజం కోసం లాజిక్ లేకుండా.. యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి..కోలీవుడ్ లో విజయ్ ని ఇష్టపడే ఫ్యాన్స్ కు మాత్రమే..మూవీ నచ్చుతుంది అనిపిస్తుంది.

బాటమ్ లైన్: విజయ్ ఫ్యాన్స్ కి ఓకే