
సినిమాల్లో జంటగా నటించడమే కాదు.. ఆ తర్వాత రియల్ లైఫ్‌లోనూ జంటగా మారిన హీరోహీరోయిన్స్‌ను ఎంతోమందిని చూశాం. ఈ వరుసలో మరో ప్రేమజంట చేరుతోంది. కోలీవుడ్ పెయిర్ గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ తమ ప్రేమ విషయాన్ని నిన్న అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇద్దరూ కలిసున్న ఫొటోస్‌కు ఓ ఎమోషనల్ నోట్‌ను యాడ్ చేసి తమ ప్రేమ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మంజిమా మోహన్.. కథానాయకుడు, మహానాయకుడు సినిమాలలో నటించింది.
తెలుగులో అంతగా గుర్తింపు లభించనప్పటికీ తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. ఇక గౌతమ్ మరెవరో కాదు.. ‘అభినందన’ లాంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైన కార్తిక్ కొడుకు. మణిరత్నం ‘కడలి’ సినిమాతో హీరోగా పరిచయమైన గౌతమ్, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2019లో వచ్చిన ‘దేవరాట్టం’లో గౌతమ్,మంజిమా కలిసి నటించారు. అది మొదలు వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్టు చాలా వార్తలొచ్చాయి. ఫైనల్‌గా పెద్దల అంగీకారంతో తమ లవ్ మేటర్‌ను రివీల్ చేసిన ఈ జంట అతి త్వరలో పెళ్లి కబురు కూడా చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.