కరీంనగర్ సిటీ, వెలుగు: ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ఖాన్ పుర ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఆదివారం సితార హాస్పిటల్ సౌజన్యంతో మహమ్మద్ జాఫర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ మెడికల్క్యాంప్ను ఆయన ప్రారంభించారు. పేషెంట్లకు మందులు పంపిణీ చేసి మాట్లాడారు.
అనారోగ్య సమస్యలను మొదట్లోనే గుర్తిస్తే మందుల ద్వారా నయం చేసుకోవచ్చని చెప్పారు. ఈ శిబిరానికి 350 మందికి పైగా ప్రజలు హాజరై, వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ జాదవ్ రాజ్ కుమార్, డాక్టర్ వెంకట్ భరద్వాజ్, నాయకులు సమద్ నవాబ్, ముఫ్తీ మహమ్మద్ అలీమొద్దీన్, ఎంఏ కరీం ఖాద్రి, మహమ్మద్ రఫీక్, సయ్యద్ మాజిద్ ఫజల్ తదితరులు పాల్గొన్నారు.
