చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్, వెలుగు : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేశారు.

అనంతరం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు ఉప్పల లింగస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనవసరంగా నోరుపారేసుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా  రాదని చెప్పారు.

కాంగ్రెస్​అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిచి అధిష్టానానికి గిఫ్ట్ గా ఇస్తారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి, చౌటుప్పల్ పీఏసీఎస్ చైర్మన్ చెన్నగొని అంజయ్యగౌడ్, చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్​మండల అధ్యక్షుడు దేవేందర్,  పట్టణ అధ్యక్షుడు నర్సింహాగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.