
నన్ను నమ్మి రెండు సార్లు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను. అధికారంలోకి రాలేకపోవడం, అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలం విఫలమైంది. తనను నమ్ముకున్న ప్రజల కోసమే బీజేపీలోకి వెళుతున్నానని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరో వారం పదిరోజుల్లో బీజేపీలో అధికారికంగా చేరబోతున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నించానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి కోరుకున్న మాట వాస్తవమేనని, అయితే… ఇప్పుడు తనకు ఎలాంటి పదవులు వద్దని, పదవి ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండనని తేల్చిచెప్పారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దించడం బీజేపీకే సాధ్యమన్నారు రాజగోపాల్ రెడ్డి.
ప్రస్తుతం తన మద్దతుదారులంతా తనవెంటే ఉన్నారని, రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం అని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో TRS కి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. కేసీఆర్ అవినీతిపాలన ను అంతమొందించడం బీజేపీతోనే సాధ్యమన్నారు.