మునుగోడు ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న కొద్దీ మాటల యుద్ధం కాస్తా.. మనీ ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అయింది. ఇప్పటికే సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి మునుగోడులోని రాజగోపాల్ అనుచరు లకు డబ్బులు పంపారని ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ విషయం అంతా ఫేక్ అని సుశీ ఇన్ ఫ్రా ఎండీ కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి కొట్టిపారేశారు. అసలు అలాంటి లావాదేవీలేమి జరగలేదని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ కంపెనీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారని కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి చెప్పారు. నిన్న ఈసీకీ టీఆర్ఎస్ ఇచ్చిన ఎకౌంట్ నెంబర్లలో వాళ్లు చెప్పినన్ని డబ్బులు లేవని.. వాటికి సంబంధించిన స్టేట్మెంట్లు రిలీజ్ చేశారు .
ఇది కేటీఆర్, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వస్తున్న కొత్త సినిమా కథ అని ట్వీట్ చేశారు. రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి రోజూ డ్రామాలు నడుస్తాయని..ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు.
