కేబినెట్ లో కేసీఆర్ సామాజిక న్యాయం పాటించారా?: కోమటిరెడ్డి

 కేబినెట్ లో కేసీఆర్ సామాజిక న్యాయం పాటించారా?: కోమటిరెడ్డి

భట్టి విక్రమార్క పాదయాత్ర చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలా కనిపిస్తుందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 125 అడుగుల విగ్రహం పెట్టినంత మాత్రానా కేసీఆర్   దళితులకు అండగా ఉన్నట్టు కాదన్నారు. కేసీఆర్ కేబినెట్ లో సామాజిక న్యాయం పాటించరా అని ప్రశ్నించారు.  మంచిర్యాల కాంగ్రెస్ సత్యాగ్రహ సభలో మాట్లాడిన కోమటిరెడ్డి 16 శాతం ఉన్న ఎస్సీలకు మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కల్పంచలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ లో అన్ని వర్గాకలు సముచిత స్థానం ఉంటుందన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం దళితులకు పదవులు ఇవ్వలేదన్నారు. నిజంగా దళితులకు ప్రేమ ఉంటే దామాషా ప్రకారం కేబినెట్ లో పదవులివ్వాలని డిమాండ్ చేశారు.  కేసీఆర్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.  రాహుల్ గాంధీని ఎంపీగా డిస్ క్వాలిఫై చేసి బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరించిందన్నారు.  తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. తాను పార్టీ మారబోనన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటుందని విమర్శించారు.