
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రధాని మోడీతో మీటింగ్‌కు అపాయింట్మెంట్ ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని కార్యాలయానికి రావాలని పీఎంవో నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అభివృద్ది పనులపై చర్చించేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోడీ అపాయింట్మెంట్ కోరారు. భేటీ సందర్భంగా వెంకట్ రెడ్డి కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
కాలుష్యం కారణంగా నల్గొండలో మూసీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకురానున్నట్లు సమాచారం. నమామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది మెట్రో, ఎంఎంటీఎస్‌కు సంబంధించి పలు అంశాలపై ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశముంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే... హైదరాబాద్, విజయవాడ హైవే గురించి ప్రధాని దృష్టికి పలు అంశాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకెళ్లనున్నారు.