కొమురం భీం జిల్లాలో విషాదం.. ఇద్దరు యువకుల మిస్సింగ్ కథ విషాదాంతం

కొమురం భీం జిల్లాలో విషాదం.. ఇద్దరు యువకుల మిస్సింగ్ కథ విషాదాంతం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకుల మిస్సింగ్ కథ విషాదాంతం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చింతలమానేపల్లి మండల కేంద్రంలో నిన్నటి(ఫిబ్రవరి 11) నుంచి ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. మానేపెల్లికి చెందిన కంబాల మహేష్ (22), కర్జెల్లి గ్రామానికి చెందిన తుమ్మిడి హరీష్ (22) అదృశ్యం అయ్యారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లకు పంపించారు పోలీసులు. మహేష్, హరీష్ ఇద్దరు స్నేహితులని కుటుంబ సభ్యులు తెలిపారు.  నిన్నటి నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈరోజు(ఫిబ్రవరి 12) చింతలమానేపల్లి మండల శివారులోని వ్యవసాయ బావిలో ఆ యువకుల ఇద్దరి మృత దేహాలను గుర్తించారు.  

వారికి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగి ఆత్మహత్య చేసుకున్నారా.. లేక వారిని ఎవరైన హత్య చేశారా.. లేక ఎక్కడైన హత్య చేసి.. వ్యవసాయ బావిలో పడివేశారా అసలేం జరిగిందనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.