కాంగ్రెస్ కు షాక్ : BJPలోకి కొండా దంపతులు..?

కాంగ్రెస్ కు షాక్ : BJPలోకి కొండా దంపతులు..?

కాంగ్రెస్ నేతలైన కొండా మురళి, కొండా సురేఖ దంపతులు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న వీరు 2014 ఎన్నికల సమయంలో TRSలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండడంతో రాజకీయ భవిష్యత్ కోసం BJPలో చేరాలని వీరు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తమ కూతురుకి భూపాలపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే షరతును కొండా దంపతులు BJP ముందు పెట్టినట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన సురేఖ ఓడిపోయారు. భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా BJPలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కొండా దంపతులతో పాటు గండ్ర కూడా భూపాలపల్లి టికెట్ కోరుతుండడంతో.. వీరి చేరికపై తమ పార్టీలో కొంత అయోమయం చోటు చేసుకుందని చెబుతున్నాయి BJP వర్గాలు.