ఈ ఏడాది 20 వేల మందికి ఇన్ఫోసిస్‌‌లో ఉద్యోగాలు

ఈ ఏడాది 20 వేల మందికి ఇన్ఫోసిస్‌‌లో ఉద్యోగాలు
  • 2.75 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇచ్చామన్న కంపెనీ సీఈఓ సలీల్‌‌ పరేఖ్

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఈ ఏడాది 20 వేల కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటుందని కంపెనీ సీఈఓ  సలీల్ పరేఖ్ తెలిపారు. ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ స్కిల్స్​లో 2.75 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ  ఇచ్చామన్నారు.

 టీసీఎస్‌‌ 12 వేల మందిని తొలగించిన నేపథ్యంలో, ఇన్ఫోసిస్ ఉద్యోగ కోతలు లేవని పరేఖ్ స్పష్టం చేశారు. ఏఐ వల్ల సాఫ్ట్​వేర్ డెవలప్‌‌మెంట్‌‌లో 5-–15శాతం, కస్టమర్ సర్వీస్‌‌లో 20శాతం ఉత్పాదకత పెరిగిందని వివరించారు. కిందటి ఆర్థిక సంవత్సరంలోని జూన్‌‌ క్వార్టర్‌‌‌‌, మార్చి క్వార్టర్లలో జీతాలు  పెంచామని, తదుపరి పెంపునకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.