
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ క్రికెటర్, రంజీ ట్రోఫీ విన్నింగ్ టీమ్ మెంబర్ హరి మోహన్ అపాయింట్ అయ్యాడు. జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఇండియా మాజీ పేసర్ సుదీప్ త్యాగిని నియమించినట్టు హెచ్‌సీఏ బుధవారం ప్రకటించింది. అసోసియేషన్ రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు హైకోర్టు నియమించిన జస్టిస్ పి. నవీన్ రావు ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్టు తెలిపింది.
హరి మోహన్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీలో నరేంద్ర పాల్ సింగ్, ఆకాష్ భండారి, షేక్ రియాజుద్దీన్, జ్యోతి శెట్టి సెలెక్టర్లుగా ఉన్నారు. సుదీప్ త్యాగి చైర్మన్‌గా ఉన్న జూనియర్ కమిటీలో హబీబ్ అహ్మద్ ఖాన్, వి.ఇ. సుందీప్ రాజన్, అరవింద్ శెట్టి, అన్వర్ అహ్మద్ ఖాన్ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలో క్రికెట్‌ను బలోపేతం చేయడంలో ఈ కమిటీలు తమ విలువైన సహకారాన్ని అందిస్తాయని హెచ్‌సీఏ ఆశాభావం వ్యక్తం చేసింది.