
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారంలో చెలరేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. సోమవారం రాత్రి డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ .. కొండా దంపతులు సురేఖ, మురళితో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన కొండా దంపతులు.. ఆ తర్వాత కొద్దిసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై వారు సీఎంకు వివరణ ఇచ్చారు. ఇకపై జాగ్రత్తగా ఉండాలని, వివాదాలకు తావివ్వకుండా బాధ్యతలు కొనసాగించాలని కొండా సురేఖకు సీఎం రేవంత్ సూచించినట్లు తెలిసింది.