కొండగట్టు అంజన్నకు రూ. 65 లక్షల ఇన్‌‌‌‌‌‌‌‌కం

కొండగట్టు అంజన్నకు రూ. 65 లక్షల ఇన్‌‌‌‌‌‌‌‌కం

 కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయ హుండీలను శుక్రవారం ఆఫీసర్లు లెక్కించారు. మొత్తం 35 రోజులకు సంబంధించిన 12 హుండీలను లెక్కించగా రూ. 65,39,167 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. అలాగే 30 గ్రాముల మిశ్రమ బంగారం, 1.850 కిలోల మిశ్రమ వెండి, 38 విదేశీ కరెన్సీ వచ్చాయని తెలిపారు. 

లెక్కింపులో ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌శ్మర, శ్రీ లలిత సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. మరో వైపు ఆషాఢమాసం కావడంతో కొండగట్టుకు భక్తుల రాక తగ్గిపోయింది. దీంతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు బోసిపోయి కనిపించాయి.