
హైదరాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దళితులకు పెద్దపీట వేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 12మంది ఎస్సీ ఎంపీలకు మోడీ తన క్యాబినెట్లో చోటిచ్చారన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ స్మృతి స్థలాలను పంచతీర్థ క్షేత్రాలుగా అభివృద్ధి చేసి ఆయన ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
60 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏనాడూ అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని, బీజేపీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎస్సీలను వ్యాపారవేత్తలుగా చేసే లక్ష్యాలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టాండప్ ఇండియా పథకం ద్వారా రాష్ట్రంలోని 1823 మంది ఎస్సీలకు రూ.472 కోట్ల రుణాలను మంజూరు చేసి వ్యాపారవేత్తలను చేసిందన్నారు.